Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చలానాల భయం.. భార్య కిందపడిపోయినా ఆగకుండా పారిపోయాడు!

Fear of Challans Biker abandons wife on road to escape police check
Advertisement
  • పోలీసుల తనిఖీని తప్పించుకోబోయి భార్యను కిందపడేసిన భర్త
  • ఆమె కిందపడినా ఆగకుండా వేగంగా పారిపోయిన వ్యక్తి
  • ఉత్తరాఖండ్‌లోని రుద్రపూర్‌లో శనివారం ఈ ఘటన
  • మహిళకు సహాయం చేసిన పోలీసులు
  • సోషల్ మీడియాలో వైరల్ అయిన ఘటన వీడియో
Advertisement
ఉత్తరాఖండ్‌లో పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకునే క్రమంలో ఓ వ్యక్తి తన భార్యను నడిరోడ్డుపైనే వదిలి పరారైన ఘటన చోటుచేసుకుంది. బైక్‌ను వేగంగా మలుపు తిప్పడంతో వెనుక కూర్చున్న భార్య కిందపడిపోయినప్పటికీ, ఆమెను ఏమాత్రం పట్టించుకోకుండా అతడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

రుద్రపూర్‌లోని త్రిశూల్ చౌక్ వద్ద శనివారం పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో వేగంగా వస్తున్న ఒక బైకర్‌ పోలీసులను చూసి, అక్కడి నుంచి తప్పించుకునేందుకు అకస్మాత్తుగా వాహనాన్ని మళ్లించాడు. ఈ క్రమంలో బైక్ వెనుక కూర్చున్న అతని భార్య బ్యాలెన్స్ కోల్పోయి రోడ్డుపై పడిపోయింది. అయినప్పటికీ, ఆ వ్యక్తి బైక్‌ ఆపకుండా అక్కడి నుంచి వేగంగా పరారయ్యాడు.

వెంటనే స్పందించిన పోలీసులు ఆమెకు సహాయం చేశారు. కిందపడిన మహిళను లేవదీసి, ఆమె ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. అనంతరం ఆమెకు ప్రాథమిక చికిత్స అందించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Advertisement
Advertisement
Uttarakhand Biker
Rudrapur Police
Traffic Challan Fear
Biker Abandons Wife
Uttarakhand Viral Video
Police Help Woman

More Telugu News